Andhra Pradesh: విద్యార్థులకు ఆర్టీసీ బస్సు పాసులు ఇక ఆన్ లైన్ లో.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

  • ఆన్ లైన్ ద్వారా పాస్ పొందే అవకాశం
  • ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం
  • బస్ పాస్ పరిధిని 50 కి.మీ పెంచిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్ పాసులను ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే పాస్ లు పొందేలా కొత్త విధానాన్ని ఆర్టీసీ తీసుకొచ్చింది.

దీనివల్ల విద్యార్థులకు గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన బాధ తప్పనుంది. కాగా, ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాయితీ పాస్ పరిధిని 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News