maharaja ranjit singh: కరాచీలో భారతీయ గాయకుడు మిల్కాసింగ్ కచేరీ.. లాహోర్‌లో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం

  • పాక్‌లో దుమారం రేపిన మిల్కాసింగ్ ప్రదర్శన
  • భారతీయ యూట్యూబ్ చానెళ్ల బహిష్కరణకు పిలుపు
  • మిల్కాసింగ్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఎలా లభించిందంటూ ప్రతిపక్షాల విమర్శలు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ను నాలుగు దశాబ్దాల పాటు పాలించిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని లాహోర్‌లో ధ్వంసం చేశారు. సిక్కు సామ్రాజ్య తొలి రాజు అయిన ఆయన 180వ వర్ధంతిని పురస్కరించుకుని లాహోర్‌లో ఈ ఏడాది జూన్‌లో 9 అడుగుల రంజిత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పడు దానిని ధ్వంసం చేశారు.

కరాచీలో ఓ బిలియనీర్ కుమార్తె వివాహ వేడుకలో భారతీయ గాయకుడు మిల్కా సింగ్ తన బృందంతో కలిసి  ఈ నెల 8న కచేరీ చేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథుల్లో కొందరు ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారతీయ సినిమాలు, డ్రామాలు, ప్రదర్శనలపై పాక్ నిషేధం విధించిన సమయంలో ఈ కచేరీ నిర్వహించడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది.

ఈ క్రమంలో లాహోర్‌లోని మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. కాగా, మిల్కాసింగ్ ప్రదర్శన పాక్‌లో సెగలు రేపుతోంది. ఆయనకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఎలా లభించిందో చెప్పాలంటూ పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మరోవైపు, పాక్ నెటిజన్లు భారత యూట్యూబ్ చానెళ్ల బహిష్కరణకు పిలుపునిచ్చారు.

More Telugu News