cow: గోశాలలో ఆవుల మృతికి విష ప్రయోగం జరిగిందనడంలో వాస్తవం లేదు!: ఏపీ పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్

  • ప్రాథమిక విచారణ వివరాలు వెల్లడి 
  • రేపు రానున్న పోస్టుమార్టం పూర్తి నివేదిక
  • మేత విషపూరితం అయి ఉంటుందని అనుమానం

ఏపీలోని కొత్తూరు తాడేపల్లిలో ఇటీవల కలకలం రేపిన గోవుల మృతికి కారణం తెలిసింది. వందకు పైగా ఆవులు మృతి చెందడంపై పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. మేతలో విష ప్రయోగం జరిగిందనడంలో నిజం లేదని, గోవుల మృతికి టాక్సిసిటీ (విషపూరితం) కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు.

ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని దామోదర్ నాయుడు తెలిపారు. గోవులకు పెట్టిన మేతలోనే టాక్సిసిటీ ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. గోశాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు పేర్కొన్నారు. నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. గోవుల శరీరంలో అనేక చోట్ల రక్తపు చారలు కనబడ్డాయని డాక్టర్ దామోదర్ పేర్కొన్నారు.  

More Telugu News