Farmers: ఏపీలో రైతు సంక్షేమం కోసం మహాపాదయాత్ర ప్రారంభం

  • రైతు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది
  • ఇంద్రకీలాద్రి-మంగళగిరి కొండ వరకు పాదయాత్ర
  • విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన వెల్లంపల్లి

రైతు సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం తలపెట్టిన మహాపాదయాత్రను విజయవాడలోని బ్రాహ్మణ వీధిలోని రావి చెట్టు వద్ద మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. వెల్లంపల్లి మాట్లాడుతూ, ఈ మ‌హాపాదయాత్ర ఇంద్ర కీలాద్రి నుంచి బయలుదేరి పాదయాత్రగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండ వరకు జరుగుతుందని చెప్పారు.

అనంత‌రం మంగళగిరి పానకాల నరసింహస్వామికి కోటి తుల‌సి ద‌ళాల‌తో అభిషేకం, అర్చ‌న‌, 108 బిందెల‌తో పాన‌కం స‌మ‌ర్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం మహాపాదయాత్ర నిర్వహిస్తున్న శ్రీ గోవింద నామ ప్ర‌చార సేవా సంఘం వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు టి.సునీతామధుసూదన్ దంపతులను అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కోటేశ్వరమ్మ, చిలకపాటి విజయరాఘవాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

More Telugu News