Nagarjuna Sagar: నాగార్జున సాగర్ బయలుదేరిన ఏపీ, టీఎస్ మంత్రులు... నేడే నీటి విడుదల!

  • రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వాలు
  • నేడు కుడి, ఎడమ కాలువలకు నీరు
  • ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్తను చెప్పాయి. ఏపీలో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, తెలంగాణలో నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీరందించే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలకు నేడు నీటిని విడుదల చేయనున్నట్టు వెల్లడించాయి. సాగర్ కు వస్తున్న వరద పెరగడం, కాలువలకు నీరందించే లో లెవల్ గేట్లకు నీరు చేరడంతో రైతులకు నీరివ్వాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.

నేటి సాయంత్రం ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుడి కాలువకు, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఇంకో 30 అడుగుల మేరకు సాగర్ జలాశయాన్ని పెంచితే, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కొండల మధ్యలో నుంచి సాగే లాంచ్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

More Telugu News