Srisailam: శరవేగంగా నిండుతున్న నాగార్జున సాగర్ జలాశయం!

  • శ్రీశైలం నుంచి భారీ వరద
  • 4.62 లక్షల క్యూసెక్కులు దిగువకు
  • నాలుగు రోజుల్లో నిండిపోయే అవకాశం

శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో నాగార్జున సాగర్ జలాశయం శరవేగంగా నిండుతోంది. శ్రీశైలంలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. డ్యామ్ 10 గేట్లనూ ఎత్తి 4.62 లక్షల క్యూసెక్కులను సాగర్ కు వదులుతున్నారు. దీంతో రోజుకు సుమారు 42 టీఎంసీల నీరు సాగర్ జలాశయానికి వస్తోంది.

ఇదే సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,395 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్ కు 735 క్యూసెక్కుల నీరు పంపుతున్నారు.

నాగార్జున సాగర్ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 530 అడుగులకు పైగా నీరు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగితే, నాలుగు రోజుల్లోనే సాగర్ నిండిపోయి, డ్యామ్ గేట్లను తెరవాల్సి వస్తుంది.

More Telugu News