Prabhas: ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేయాలనుకుంటున్నా: ప్రభాస్

  • సాహో చిత్రానికి రెండేళ్లు కేటాయించాలని అనుకోలేదన్న ప్రభాస్
  • యాక్షన్ సీక్వెన్స్ ల కోసమే ఏడాది పట్టిందంటూ వివరణ
  • సాహో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్

ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. బాహుబలి చిత్రాల కోసం ఐదేళ్లు వెచ్చించానని, సాహో కోసం మొదట రెండేళ్లు కేటాయించాలని భావించలేదని తెలిపారు.

కానీ, సాహో యాక్షన్ సీక్వెన్స్ ల కోసమే ఏడాది సమయం పట్టిందని అన్నారు. సాహో చిత్రం జరుగుతుండగానే తనది మరో కొత్త సినిమా కూడా ప్రారంభమైందని, ఆ సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగే జరిగిందని ప్రభాస్ తెలిపారు. అయితే, సాహో చిత్రానికి సంబంధించి అబుదాబి ఎపిసోడ్ కోసం చాలా కష్టపడ్డానని వివరించారు.

More Telugu News