AICC: మళ్లీ రాహులే రావాలి... కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదీ అదే మాట!

  • ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే కొనసాగాలంటున్న వర్కింగ్ కమిటీ
  • మత తత్వ పార్టీలు పెచ్చరిల్లుతున్న తరుణంలో కాంగ్రెస్ ను, దేశాన్ని కాపాడేది రాహుల్ ఒక్కడేనంటూ ఏక వాక్య తీర్మానం
  • ఈ రాత్రికి మరోసారి సమావేశం కానున్న సీడబ్ల్యూసీ

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు సమావేశమైన వర్కింగ్ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే వంటి నేతల పేర్లు కొత్త అధ్యక్షుడి రేసులో బలంగా వినిపించినా, వర్కింగ్ కమిటీ సభ్యులందరూ రాహుల్ గాంధీ వైపే మొగ్గుచూపారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని మించిన సమర్థుడు మరొకరు లేరని, మత తత్వ పార్టీలు దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని నడిపించడంతో పాటు దేశాన్ని రక్షించగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే, రాహులే మళ్లీ రావాలంటూ సీడబ్ల్యూసీ ఏకవాక్య తీర్మానం చేసింది.

అయితే, తమ నిర్ణయంపై రాహుల్ ఏమంటాడోనన్న అంతర్మధనంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాత్రి 8 గంటలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దారుణ ఫలితాలు చవిచూసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన మనసు మార్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదు.

More Telugu News