Rahul Gandhi: పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదు... హర్యానా సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాహుల్

  • కశ్మీరీ యువతులపై హర్యానా సీఎం అనుచిత వ్యాఖ్యలు
  • ఇక అందరి చూపు కశ్మీరీ అందమైన అమ్మాయిలపైనే ఉంటుందని వెల్లడి
  • మండిపడిన రాహుల్ గాంధీ

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, ఇక అందరి చూపు అందమైన కశ్మీరీ అమ్మాయిలపైనే ఉంటుందని, వారిని కోడళ్లుగా, భార్యలుగా తెచ్చుకునేందుకు మొగ్గు చూపుతారంటూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. పురుషులు సొంతం చేసుకోవడానికి మహిళలేమీ ఆస్తులు కాదని స్పష్టం చేశారు. కశ్మీరీ యువతులపై హర్యానా సీఎం వ్యాఖ్యలు తుచ్ఛమైనవని మండిపడ్డారు. అభద్రతాభావంతో కూడిన ఓ బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఏళ్ల తరబడి ఆర్ఎస్ఎస్ శిక్షణ ఎలా తయారుచేస్తుందో చెప్పడానికి ఖట్టర్ వ్యాఖ్యలే ఉదాహరణ అని నిశితంగా విమర్శించారు.

More Telugu News