Congress: అధ్యక్ష ఎన్నిక సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించిన సోనియా, రాహుల్

  • ఏఐసీసీ చీఫ్ ను ఎన్నుకునేందుకు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
  • ఐదు ఉప కమిటీలుగా విడిపోయిన సభ్యులు
  • కమిటీల్లో తమ పేర్లు చేర్చడంపై సోనియా, రాహుల్ అభ్యంతరం

కాంగ్రెస్ పార్టీకి నవ్యోత్తేజం అందించే కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కాగా, కొత్త చీఫ్ ను ఎన్నుకునే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 ఉప కమిటీలుగా ఏర్పడింది. ఈ కమిటీల్లో తమ పేర్లను చేర్చడం పట్ల సోనియా, రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధ్యక్షుడి ఎన్నికపై తమ ప్రభావం పడే ఎలాంటి చర్యకు తాము సమ్మతం కాదని ఇరువురు స్పష్టం చేయడమే కాకుండా, సమావేశం నుంచి నిష్క్రమించారు. కొత్త నాయకుడి ఎన్నికలో పారదర్శకత ఉండాలంటే తాము ఎన్నిక ప్రక్రియకు దూరంగా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్న సోనియా, రాహుల్ సమావేశం మధ్యలోనే బయటికి వచ్చేశారు. మరికాసేపట్లో కాంగ్రెస్ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడి కానుంది.

More Telugu News