India: భారత్‌కే రష్యా మద్దతు.. ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు చేపట్టాలని ఇరు దేశాలకు హితవు

  • కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయం సరైనదే
  • రాజ్యంగానికి లోబడే నిర్ణయం తీసుకుందని నమ్ముతున్నాం
  • ఇరు దేశాలు సంయమనం పాటించాలి

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రష్యా.. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని పేర్కొంది. ఉద్రిక్తతలు చల్లార్చే చర్యలను ఇరు దేశాలు తీసుకుంటాయని భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు, జమ్ముకశ్మీర్ విషయంలో భారత్ తన రాజ్యాంగానికి లోబడే నిర్ణయం తీసుకుందని నమ్ముతున్నట్టు ప్రకటించి పాక్‌కు షాకిచ్చింది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణను ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్న పాక్ అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. దీంతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ దుందుడుకుగా వ్యవహరిస్తోంది.

More Telugu News