union govt: ఉగ్రవాదులకు ఆర్థిక సాయం.. జమ్ముకశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

  • 2017లో రషీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు
  • తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
  • ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే అయిన రషీద్ ఇంజినీర్‌ ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. 2017లో ఓసారి ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలిపెట్టింది. తాజాగా ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపింది.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలోని ఉగ్రవాదుల భరతం పట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల 70 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానంలో ఆగ్రా జైలుకు తరలించారు.  

More Telugu News