National film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. జాతీయ ఉత్తమ చిత్రంగా ‘హెల్లారో’

  • ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ఉరి)
  • ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి)
  • ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి)

భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డులను ఇవ్వడం ఆనవాయతీ. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అవార్డులను ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించింది. 2018లో దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషా చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటించారు. అంతకుముందు, విజేతల వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు జ్యూరీ సభ్యులు అందజేశారు.
 
అవార్డుల వివరాలు..

ఉత్తమ చిత్రం: హెల్లారో (గుజరాతీ)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ఉరి)
ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్), విక్కీ కౌశల్ (ఉరి)
ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి)
ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్ కిరే (చంబక్)
ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బదాయ్ హో)
ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ (మరాఠీ)
ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మాన్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్ హో
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: సుధాకర్ రెడ్డి యకాంతి (మరాఠీ  సినిమా నాల్)

ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
ఉత్తమ యాక్షన్ సినిమా: కేజీఎఫ్ (కన్నడ)
ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి|| ల|| సౌ||
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం : ‘ఆ!’ (తెలుగు) కేజీఎఫ్ (కన్నడ)
ఉత్తమ సాహిత్యం: నాతిచరామి (కన్నడ)
ఉత్తమ మేకప్: ‘ఆ!’
ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్: మహానటి
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమ్మార సంభవం (మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి (కన్నడ)

ఉత్తమ సౌండ్ డిజైనర్: ఉరి (బిశ్వదీప్ ఛటర్జీ)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అంధాధున్
ఉత్తమ సంభాషణలు: తారీఖ్ (బెంగాలీ)
ఉత్తమ గాయని: బిందుమాలిని (నాతి చరామి: మాయావి మానవే)
ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్ (పద్మావత్: బింటే దిల్)
ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్..వండల్లా ఎరదుల్లా (కన్నడ), సమీప్ సింగ్ హర్జీతా..పంజాబీ), తలా అర్షద్ రేసి (హమీద్) శ్రీనివాస్  పోకాలే (నాళ్)

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్ (హిందీ)
జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్

నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరదుల్లా (కన్నడ)

More Telugu News