Manchu Vishnu: మంచు విష్ణుకు మరో అమ్మాయి పుట్టింది!

  • పండంటి శిశువుకు జన్మనిచ్చిన విరానికా
  • ట్విట్టర్ లో ఆనందాన్ని పంచుకున్న మంచు విష్ణు
  • విష్ణుకు శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, విరానికా దంపతులకు మరోసారి అమ్మాయి జన్మించింది. విష్ణుకు ఇప్పటికే ఇద్దరు కవల అమ్మాయిలు, అవ్రామ్ అనే అబ్బాయి ఉన్నారు. కాగా, తనకు మళ్లీ అమ్మాయి పుట్టిందంటూ విష్ణు ట్వీట్ చేశారు. "ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్" అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మంచు విష్ణుకు ఈ ఆనందమయ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

More Telugu News