Punjab: పంజాబ్, హర్యానాల్లో ఉగ్రదాడి జరిగే అవకాశం: ఇంటెలిజెన్స్

  • ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం యత్నిస్తోంది
  • ఈ క్రమంలో, సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడవచ్చు
  • బీఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి

ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్ కుట్రలకు తెరతీస్తోంది. తాను పెంచి, పోషిస్తున్న ఉగ్రమూకలను భారత్ పై దాడులకు ఉసిగొల్పుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులను సరిహ్దదులు దాటించేందుకు పాక్ సైన్యం కాల్పులకు తెగబడవచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.

ఇదే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ బీఎస్ఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లకు కూడా హెచ్చరికలు పంపింది. మరోవైపు, ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నియంత్రణరేఖ వద్దకు సైన్యం అదనపు బలగాలను తరలించింది. పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడినైనా అణచివేసేందుకు సిద్ధంగా ఉంది.

More Telugu News