america: కశ్మీర్‌ విషయంలో ఎప్పటికీ మా నిర్ణయం అదే : అమెరికా

  • ద్వైపాక్షిక చర్చలతోనే సమస్య పరిష్కరించుకోవాలి
  • ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నాం
  • కశ్మీర్‌తో సంబంధం ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలు  సంయమనం పాటించాలి

కశ్మీర్‌ అంశం పూర్తిగా భారత్‌-పాకిస్థాన్‌ ద్వైపాక్షిక అంశమని, ఇరుదేశాలు శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని   అమెరికా స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పుడూ, ఎప్పుడూ తమ అభిప్రాయం అదేనని తెలిపింది. వైట్‌హౌస్‌ అధికార  ప్రతినిధి మోర్గాన్‌ ఓర్టగస్‌ మాట్లాడుతూ చర్చలకు అమెరికా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

కశ్మీర్‌తో సంబంధం ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలు సంయమనం పాటించాలని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాము గమనిస్తున్నామని తెలిపింది. పాకిస్థాన్‌ ప్రధాని ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు కశ్మీర్‌ అంశమే ప్రధానంగా సాగలేదని, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. కశ్మీర్‌లో భారత్‌ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న పాకిస్థాన్‌ ఆరోపణలపై మోర్గాన్‌ స్పందించేందుకు నిరాకరించారు. త్వరలో అమెరికా ప్రతినిధి భారత్‌లో పర్యటిస్తారని, ఈ సందర్భంగా అన్ని అంశాలు చర్చిస్తారని తెలిపారు.

More Telugu News