Nani: 'సాహో' మన సినిమా: నాని

  • ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకున్న 'సాహో'
  • ఆగస్టు 30న రిలీజ్
  • 'సాహో' కోసం నాలుగు చిత్రాల విడుదల వాయిదా
  • 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ డేట్ రేపు ప్రకటిస్తామన్న నాని

బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆగస్టు 30న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా కోసం నాలుగు సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడ్డాయి. ఆ చిత్రాల్లో నాని హీరోగా వస్తున్న 'గ్యాంగ్ లీడర్' కూడా ఉంది. ఈ విషయాన్ని హీరో నాని ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నాడు.

'సాహో' మన సినిమా అని, దేశవ్యాప్తంగా విడుదలకు ముందే క్రేజ్ సంపాదించుకుందని ట్వీట్ చేశాడు. 'సాహో' విజయం సాధిస్తే అది తమకందరికీ వేడుక అని తన సహృదయతను చాటుకున్నాడు. ఆగస్టు 30న 'సాహో' రిలీజవుతున్న సందర్భంగా ప్రభాస్ అన్నకు, చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు అంటూ నాని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ డేట్ ను రేపు ప్రకటిస్తామని వెల్లడించాడు.

More Telugu News