India: 'ఆర్టికల్ 370' రద్దు ఎఫెక్ట్: సంఝౌతా ఎక్స్ ప్రెస్ ను నిలిపివేసిన పాకిస్థాన్

  • ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వం
  • రగిలిపోతున్న పాకిస్థాన్
  • ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గించిన దాయాది దేశం

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్ అనేక రూపాల్లో తన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన పాక్ ప్రభుత్వం, తాజాగా ఇరుదేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, పాకిస్థాన్ ల మధ్య నడిచే ఈ రైలు ఇరుదేశాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. పాక్ తీవ్ర నిర్ణయంతో వాఘా-అటారీ బోర్డర్ వద్ద వందలాది మంది ప్రయాణికులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.

More Telugu News