Telangana: వరంగల్ లో 9 నెలల చిన్నారి హత్యాచారం కేసు.. రేపిస్టుకు ఉరిశిక్ష విధించిన కోర్టు!

  • జూన్ 18న చిన్నారిని రేప్ చేసి చంపేసిన ప్రవీణ్
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్ చేసిన పోలీసులు
  • 48 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు

తెలంగాణలోని వరంగల్ కు చెందిన 9 నెలల చిన్నారి శ్రీహితను అత్యాచారం చేసి చంపేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. చిన్నారిపై హత్యాచారం చేసిన ప్రవీణ్ ను దోషిగా తేల్చిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. కేసును విచారించిన కోర్టు కేవలం 48 రోజుల్లోనే దోషికి మరణదండన విధించింది. ఈ ఏడాది జూన్ 18న తెల్లవారుజామున తల్లి పక్కనే నిద్రపోతున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లాడు.

ఈ ఘటన ఇంటికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఈ సందర్భంగా నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తుండటంతో గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో తానే ఈ నేరం చేశానని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

More Telugu News