హైదరాబాద్ లో ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ చేసి అలరించిన రేణూ దేశాయ్!

08-08-2019 Thu 11:37
  • చేనేత వస్త్రాలపై కొందరికి చిన్నచూపు
  • ఇవి ఖరీదుగా ఉన్నమాట వాస్తవమే
  • హైదరాబాద్ ఫ్యాషన్ లో పాల్గొన్న నటి
చేనేత వస్త్రాలు అనగానే ప్రస్తుతం కొందరికి చిన్నచూపు అయిపోయిందని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ అన్నారు. చేనేత వస్త్రాలు కొంచెం ఖరీదుగా మారిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేవలం మహిళలే కాకుండా అబ్బాయిలకు కూడా చేనేత షర్టులు, టీషర్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన చేనేత వస్త్రాల ఫ్యాషన్ షోలో పాల్గొన్న రేణూ దేశాయ్.. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను అలరించారు.