Terrorist Attacks: భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర... ఏపీ సహా ఏడు రాష్ట్రాల్లో హైఅలర్ట్

  • ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో రగిలిపోతున్న పాకిస్థాన్
  • పుల్వామా తరహా ఉగ్రదాడులకు స్కెచ్
  • విమానాశ్రయాల వద్ద భద్రత కట్టుదిట్టం

జమ్ముకశ్మీర్ కు ఏడు దశాబ్దాలుగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో... పాకిస్థాన్, ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులు అసహనంతో రగిలిపోతున్నారు. భారత్ లో భారీ ఎత్తున ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయతో పాటు ఏడు రాష్ట్రాల్లో జైషే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, పోలీస్, ఇతర భద్రతాదళాలపై పుల్వామా తరహా దాడులు చేసే దిశగా ఉగ్రవాదులను పాక్ కు చెందిన ఐఎస్ఐ ప్రేరేపిస్తోందని తెలిపాయి.

ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విజిటర్స్ ను కూడా అనుమతించడం లేదు. కేవలం ప్రయాణికులను మాత్రమే విమానాశ్రయాల వద్దకు అనుమతిస్తున్నారు.

More Telugu News