Jammu And Kashmir: కశ్మీర్ వీధుల్లో తిరిగిన అజిత్ దోవల్..స్థానికులతో మాటామంతీ!

  • ‘ఇప్పుడెలా ఉంది పరిస్థితి?
  • ‘పునర్విభజన గురించి ఏనుకుంటున్నారు?
  • స్థానికులతో కలిసి భోజనం చేసిన దోవల్

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించడం, ఆర్టికల్ 370 రద్దుతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, భయపడాల్సిన పరిస్థితులు లేవని, స్వేచ్ఛగా అక్కడి వీధుల్లో తిరగొచ్చని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చాటి చెప్పారు.కశ్మీర్ లోయలో, షోపియన్ జిల్లాలోని రోడ్లపై సాధారణ ప్రజలతో కలిసి ఈరోజు ఆయన భోజనం చేశారు. జమ్ముకశ్మీర్ లో సంతరించుకున్న పరిణామాలపై స్థానికులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

‘ఇప్పుడెలా ఉంది పరిస్థితి?’ ‘పునర్విభజన గురించి ఏనుకుంటున్నారు? అంటూ ప్రశ్నించిన ధోవల్, స్థానికుల సమాధానాలను ఆసక్తిగా వినడం గమనార్హం. అందరూ బాగుండాలని, ప్రశాంత జీవనం సాగించాలని,ప్రజల భద్రతే తమకు ప్రధానమని, భవిష్యత్ తరాలు బాగుపడేలా పరిస్థితులు మార్చాలని తాము ఎప్పుడూ ఆలోచిస్తుంటామని స్థానికులతో దోవల్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. షోపియాన్ లో పహారా కాస్తున్న భద్రతా సిబ్బందితో, స్థానిక పోలీసులతో కూడా ఆయన ముచ్చటించారు. సిబ్బందితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారిలో స్ఫూర్తిని నింపేలా ఆయన మాట్లాడారు. అజిత్ దోవల్ వెంబడి కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్  కూడా ఉన్నారు. 

More Telugu News