Prabhas: 'సాహో' నుంచి కొత్తగా మరో పోస్టర్

  • భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాహో'
  • ఈ నెల 10న ట్రైలర్ ను వదిలే ఆలోచన 
  • ప్రమోషన్స్ నిమిత్తం రంగంలోకి దిగనున్న ప్రభాస్

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.

శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్ .. అరుణ్ విజయ్ ప్రధానమైన ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఇక మరో కీలకమైన పాత్రను జాకీ ష్రాఫ్ చేశాడు. వాళ్లందరి లుక్స్ తో వదిలిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ప్రమోషన్స్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడని సమాచారం. 

More Telugu News