Srisailam: అటు తెలంగాణకు, ఇటు రాయలసీమకు... పరుగులు పెడుతున్న కృష్ణమ్మ!

  • మొదలైన ఎత్తిపోతల పథకాలు
  • హంద్రీనీవా, పోతిరెడ్డిపాడులకు నీరు
  • కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో, అన్ని ఎత్తిపోతల మోటార్లనూ అధికారులు ఆన్ చేశారు. రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే కెనాల్స్ గేట్లను ఎత్తారు. తెలంగాణకు నీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులను, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,066 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో హంద్రీనీవాకు 1,013 క్యూసెక్కులను, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది.

More Telugu News