america: అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం

  • రోడ్డు ప్రమాదంలో శివతేజ మృతి
  • శివతేజ స్వగ్రామం ప్రకాశం జిల్లా బల్లికురవ 
  • టొరొంటో సరస్సులో మునిగి మృతి చెందిన జగన్‌మోహన్

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా బల్లికురవ ప్రాంతానికి చెందిన చింతల శివతేజ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సహచర ఉద్యోగినితో కలిసి కార్యాలయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు కొల్టేడు ప్రాంతంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శివతేజతోపాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది.  

మరో సంఘటనలో రంగారెడ్డి జిల్లా మంఖాల్‌కు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి కెనడాలో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ మరో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. టొరొంటోని ఓ సరస్సులో మునిగి అతను ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగు చూశాయి.

More Telugu News