Sushma Swaraj: సుష్మా స్వరాజ్ అంత్యక్రియల వివరాలు!

  • తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూత
  • 12 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
  • లోధీ రోడ్ శ్మశానంలో అంత్యక్రియలు

తీవ్రమైన గుండెపోటు కారణంగా, గత రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు నేటి సాయంత్రం లోధీ రోడ్ లోని శ్మశాన వాటికలో జరుగనున్నాయి. నిన్న రాత్రే ఆమె పార్థివ దేహాన్ని జంతర్ మంతర్ లోని నివాసానికి తరలించగా, అప్పటి నుంచి పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పిస్తున్నారు.

ఇక ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్ కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

More Telugu News