Sonia Gandhi: అదే జరిగితే గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుంటా: సోనియా విషయంలో సుష్మ నాటి శపథం

  • 1999లో బళ్లారిలో సోనియాపై పోటీ
  • 56 వేల ఓట్ల తేడాతో ఓటమి
  • సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న వైనం

బీజేపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న సుష్మా స్వరాజ్ 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి బరిలోకి దిగి సోనియా గాంధీకి ముచ్చెమటలు పట్టించారు. వీరిద్దరి మధ్య జరిగిన పోటీని అప్పట్లో బీజేపీ నేతలు విదేశీ కోడలు-స్వదేశీ కుమార్తె మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ 56 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  

1999 తర్వాత కూడా సోనియాగాంధీ-సుష్మా స్వరాజ్ మధ్య రాజకీయ వైరం కొనసాగింది. 2004 ఎన్నికల్లో యూపీయే ఘన విజయం సాధించింది. అయితే, సోనియా కనుక ప్రధాని పీఠాన్ని అధిష్ఠిస్తే తాను గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుని నిరసన తెలుపుతానని సుష్మ హెచ్చరికతో కూడిన శపథం చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. బ్రిటిషర్ల పాలన ముగిసినా దేశాన్ని ఇంకా విదేశీయులు పాలించడం తనకు సమ్మతం కాదని తేల్చి చెప్పారు. అయితే, కారణాంతరాల వల్ల సోనియా ప్రధాని పదవిని చేబట్టని విషయం మనకు తెలిసిందే! 

More Telugu News