Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు.. కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

  • ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా
  • కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘సుప్రీం’ను ఆశ్రయిస్తా
  • దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోంది

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. లోక్ సభలో దీనిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని, భారత్ కూడా చైనాలా మారుతోందని విమర్శించారు. దేశంలో పరిపాలన నాజీలను తలపిస్తోందని, నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను పాలస్తీనాలా తయారు చేస్తున్నారని అంటూ, ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

More Telugu News