Article: ‘370’ విషయంలో అనేక అవాస్తవాలు చెబుతున్నారు: సుప్రియా సూలే

  • జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
  • ఉద్రిక్త పరిస్థితుల మధ్య చర్చలు జరపలేం
  • రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా విభజన చేస్తే ఇబ్బంది ఉండదు

ఆర్టికల్ 370 విషయంలో అనేక అవాస్తవాలు చెబుతున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సభ్యురాలు సుప్రియా సూలే ప్రభుత్వాన్ని విమర్శించారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఉద్రిక్త పరిస్థితుల మధ్య చర్చలు జరపలేమని అన్నారు. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా విభజన చేస్తే ఇబ్బంది ఉండదని, ప్రభుత్వ విధానాలు ఏంటో స్పష్టం చేయడం లేదని విమర్శించారు. జమ్ముకశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి ఆర్టికల్ 370 అడ్డుగా ఉందన్న వాదనతో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు.

More Telugu News