Naresh: నాకు ఇద్దరు గురువులు: సీనియర్ నరేశ్

  • బాలనటుడిగా తొలి చిత్రం 'పండంటి కాపురం'
  • హీరోగా చేసిన మొదటి సినిమా 'నాలుగు స్తంభాలాట'
  • మీ శ్రేయోభిలాషి' మంచి పేరు తెచ్చిపెట్టింది

తెలుగు తెరపై హాస్యకథానాయకుడిగా సీనియర్ నరేశ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న ఆయన, ఆ తరువాత క్యారెక్టర్ ఆరిస్టుగా మారిపోయి ఇప్పటికీ బిజీగానే వున్నారు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. "బాలనటుడిగా నా తొలి చిత్రం 'పండంటి కాపురం'. హీరోగా నేను చేసిన తొలి చిత్రం 'నాలుగు స్తంభాలాట'. ఈ సినిమా నుంచి హీరోగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. హీరోగా నా కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా సాగించడానికి కారకులు ఒకరు మా అమ్మగారైతే .. మరొకరు జంధ్యాలగారు. ఈ ఇద్దరినీ నేను గురువులుగా భావిస్తూ వుంటాను. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా నన్ను బిజీ చేసిన చిత్రం 'మీ శ్రేయోభిలాషి'. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News