Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రెండు భాషల్లోకి 'ఓ బేబీ' డబ్బింగ్ 
  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మరోసారి
  • వెబ్ సీరీస్ లో నటిస్తున్న మీనా
  • అనుష్క 'సైలెన్స్' పూర్తయిందట

*  సమంత ప్రధాన పాత్ర పోషించిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ భాషల్లోకి అనువదిస్తోంది.
*  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయడానికి నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం త్రివిక్రమ్ అప్పుడే ఓ స్టోరీ లైన్ ని కూడా అనుకున్నట్టు తెలుస్తోంది.
*  ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన మీనా ఇప్పుడు ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఓకే చెప్పింది. 'కరోలిన్ కామాక్షి' పేరిట వివేక్ కుమరన్ రూపొందించే ఈ వెబ్ సీరీస్ భక్తి రస ప్రధానంగా సాగుతుందని సమాచారం.
*  'భాగమతి' తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం 'సైలెన్స్'. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నిన్నటితో పూర్తయింది. ఇందులో అనుష్క సరసన మాధవన్ జంటగా నటించాడు.  

More Telugu News