Subramanian Swamy: నమో సర్కారు ఇక నెహ్రూ పిటిషన్ పై దృష్టి పెట్టాలి: సుబ్రహ్మణ్యస్వామి

  • ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి
  • నెహ్రూ భద్రతామండలిలో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలంటూ సూచన

ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు జమ్మూకశ్మీర్ ను రెండు ముక్కలు చేసిన బీజేపీ సర్కారు నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ లో స్పందించారు. ఇక నమో సర్కారు నెహ్రూ దాఖలు చేసిన పిటిషన్ పై దృష్టి పెట్టాలని సూచించారు.

అప్పట్లో కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలంటూ భద్రతామండలిలో జవహర్ లాల్ నెహ్రూ పిటిషన్ దాఖలు చేశారని, ఆ పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. నాడు ఆ పిటిషన్ ను కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేకుండానే భద్రతామండలికి పంపారని, కానీ, క్యాబినెట్ అనుమతిలేని ఆ పిటిషన్ చెల్లదని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు.

More Telugu News