Jammu And Kashmir: ఆర్టికల్ 370, 35-A రద్దుతో కశ్మీర్ కు కచ్చితంగా లాభమే చేరూరుతుంది: అమిత్ షా

  • ప్రజల బాగోగుల కోసమే పార్లమెంట్ చట్టాలు చేస్తోంది
  • ఆ చట్టాలు జమ్ముకశ్మీర్ ప్రజలకు చేరడం లేదు
  • ఆర్టికల్ 370 పేరుతో ఇప్పటి వరకూ అడ్డుగోడలు కట్టారు

ఆర్టికల్ 370, 35-A రద్దుతో జమ్ముకశ్మీర్ కు కచ్చితంగా లాభమే చేకూరుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా వివరణ ఇస్తూ.. ప్రజల బాగోగుల కోసమే పార్లమెంట్ చట్టాలు చేస్తోందని, ఆ చట్టాలు జమ్ముకశ్మీర్ ప్రజలకు చేరడం లేదని,  ఆర్టికల్ 370 రద్దుతోనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు.

ఆర్టికల్ 370 పేరుతో ఇప్పటి వరకూ అడ్డుగోడలు కట్టారని, ఇప్పటికైనా వాటిని తొలగిద్దామని అన్నారు. ఈ ప్రాంత యువతులు ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారు ఆస్తి హక్కు కోల్పోతున్నారని, అక్కడి మహిళలకు సాధికారత రావాలంటే ఈ ఆర్టికల్  రద్దు కావాలని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు. ఈ బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని, ఈ బిల్లు పూర్తిగా న్యాయ సమీక్షకు నిలబడుతుందని స్పష్టం చేశారు. 

More Telugu News