Jammu And Kashmir: ఈ రోజు ’బ్లాక్ మండే’గా చరిత్రలో నిలిచిపోతుంది: డెరెక్ ఓబ్రెయిన్

  • జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో తీవ్ర చర్చ
  • రాజ్యాంగం, పార్లమెంట్ కు ఈ రోజు చీకటి రోజు
  • కేంద్రం చర్య రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ను పరిహసించేలా ఉంది

జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై రాజ్యసభలో వాడీవేడీ చర్చజరుగుతోంది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ, ఈరోజు ‘బ్లాక్ మండే’గా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, పార్లమెంట్ కు ఈ రోజును చీకటి రోజుగా అభివర్ణించారు. బీజేపీ చర్యలు రాజ్యాంగంలోని 3వ అధికరణానికి విరుద్ధంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చర్య రాజ్యాంగాన్ని, పార్లమెంట్ ను పరిహసించేలా ఉందని అన్నారు. 

More Telugu News