Jammu And Kashmir: జస్ట్ ఐదేళ్లు.. కశ్మీర్ మరో పాలస్తీనాగా మారిపోతుంది.. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా హెచ్చరిక!

  • ఆర్టికల్ 370ని రద్దుచేసిన కేంద్రం
  • రాష్ట్రాన్ని విభజన చేస్తూ నిర్ణయం
  • తీవ్రంగా తప్పుపట్టిన ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు 

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఆర్టికల్ 370ని రద్దుచేశారని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఎంతమాత్రం సమర్థించబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సోషలిస్టు నేత, దివంగత జయప్రకాశ్ నారాయణ రాసిన ఓ లేఖను ఆయన రాజ్యసభలో చదివారు.

‘ఒకవేళ కశ్మీర్  ప్రజలను అణచివేయాలని భారత్ అనుకుంటే అది భారతీయ ఆత్మకు ఆత్మహత్య సదృశమే’ అని జయప్రకాశ్ నారాయణ్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ రాష్ట్రం పాలస్తీనాగా మారేందుకు మనం ఓ దారిని తెరిచామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో కశ్మీర్ పాలస్తీనాగా మారిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అహాన్ని వీడి, కశ్మీరీలను కలుపుకునిపోవాలని సూచించారు.

More Telugu News