Jammu And Kashmir: కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది!: డీఎంకే అధినేత స్టాలిన్

  • కశ్మీర్ ప్రజల మనోభావాల్ని పట్టించుకోలేదు
  • అన్నాడీఎంకే కూడా దీన్ని సమర్థిస్తోంది
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీఎంకే చీఫ్

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేయడంపై డీఎంకే అధినేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. జమ్మూకశ్మీర్ ప్రజల అభిప్రాయం, మనోభావాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని స్టాలిన్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ  చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా దీన్ని సమర్థించడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాగా, జమ్మూకశ్మీర్ ప్రజలకు మద్దతు తెలిపిన ఎంకే స్టాలిన్ కు మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ధన్యవాదాలు చెప్పారు.

More Telugu News