Jammu And Kashmir: ఏం చేస్తే ఏమవుతుంది?... కాశ్మీర్ పై మొదలైన క్యాబినెట్ చర్చ!

  • పలు అంశాలపై చర్చిస్తున్న క్యాబినెట్
  • సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు హాజరు
  • మంత్రి రవిశంకర్ తో అమిత్ షా ప్రత్యేక భేటీ

జమ్మూ కశ్మీర్‌ పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. కశ్మీర్‌ పై ఏ విధమైన వ్యూహాలను అమలుచేస్తే, ఎటువంటి సమస్యలు వస్తాయన్న విషయంపైనే ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టడం, నిరసనలు, ధర్నాలు చేపట్టకుండా కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపైనా నేతలు చర్చిస్తున్నారని సమాచారం.

కాగా, ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు. క్యాబినెట్ భేటీ తరువాత పార్లమెంట్ కు చేరుకునే నరేంద్ర మోదీ టీమ్, అక్కడ కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. తీవ్ర వివాదాస్పదమైన ఆర్టికల్‌ 35A ను రద్దు చేయవచ్చనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మంత్రిమండలి భేటీకి ముందు అమిత్ షా ఇదే విషయమై మరో మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో చర్చలు జరపడం గమనార్హం.

More Telugu News