Anupam Kher: కశ్మీర్ సమస్య పరిష్కారం కాబోతోంది: అనుపమ్ ఖేర్

  • ఉత్కంఠను రేపుతున్న జమ్ముకశ్మీర్ పరిణామాలు
  • భద్రతాబలగాల నీడలో కశ్మీర్ లోయ
  • కశ్మీర్ సమస్యకు ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం

జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 35వేల సాయుధ బలగాలను కేంద్రం అక్కడకు పంపించింది. అంతేకాదు, అమర్ నాథ్ యాత్ర భద్రత కోసం వెళ్లిన 40వేల సాయుధ బలగాలు అక్కడే విధుల్లో ఉన్నాయి. మరోవైపు, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని కశ్మీర్ సమస్యకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కశ్మీర్ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'కశ్మీర్ సమస్యకు పరిష్కారం ప్రారంభమైంది' అని ఆయన ట్వీట్ చేశారు. గతంలో అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ, ఆర్టికల్ 35A, ఆర్టికల్ 370లను రద్దు చేస్తేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అనుపమ్ ఖేర్ జమ్ముకశ్మీర్ కు చెందిన కశ్మీరీ పండిట్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.

More Telugu News