Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో చిత్రానికి అనుష్క గ్రీన్ సిగ్నల్
  • శంకర్ సినిమాకి రత్నవేలు ఫొటోగ్రఫీ
  • వచ్చే నెలకి సూర్య 'బందోబస్తు'

*  ప్రస్తుతం 'సైలెన్స్' చిత్రంలో నటిస్తున్న కథానాయిక అనుష్క తాజాగా రాఘవేంద్రరావు నిర్మించే చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ముగ్గురు దర్శకులతో రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన అనుష్క నాయికగా నటిస్తుందట.
*  ప్రస్తుతం 'సైరా', 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రాలకు పనిచేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మరో భారీ చిత్రానికి పనిచేయడానికి అంగీకరించాడు. కమలహాసన్ హీరోగా శంకర్ రూపొందిస్తున్న 'భారతీయుడు 2' చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాడు.
*  సూర్య హీరోగా నటించిన 'కప్పాన్' తమిళ చిత్రాన్ని 'బందోబస్తు' పేరిట తెలుగులోకి అనువదిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే నెల 20కి వాయిదా వేసినట్టు అధికారికంగా ప్రకటించారు.

More Telugu News