Pakistan: పాకిస్థాన్ లో టెన్షన్.. టెన్షన్.. జాతీయ భద్రతా కమిటీ భేటీకి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపు!

  • ఏడుగురు బ్యాట్ కమాండోలను చంపిన భారత్
  • జమ్మూకశ్మీర్ లో 35 వేల మంది బలగాల మోహరింపు
  • భేటీకి హాజరుకానున్న రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు

ఓవైపు పాకిస్థాన్ కు చెందిన ఏడుగురు బ్యాట్ కమాండోలను భారత సైన్యం కాల్చిచంపడం, జమ్మూకశ్మీర్ లో మరో 35,000 మంది అదనపు బలగాలను మోహరించడంతో దాయాది దేశం పాకిస్థాన్ అప్రమత్తమైంది. రాజధాని ఇస్లామాబాద్ లో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నేతలు, ఆర్మీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత్ జరిపిన క్లస్టర్ బాంబుల దాడిపై చర్చిస్తారని పాక్ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. మరోవైపు నిషేధిత క్లస్టర్ బాంబులను తాము ప్రయోగించలేదని భారత ఆర్మీ ఇప్పటికే స్పష్టం చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసే అవకాశముందన్న నిఘావర్గాల హెచ్చరికలతో అమర్ నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే స్థానికేతరులను స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా కశ్మీర్ పాలనాయంత్రాంగం ఇప్పటికే ఆదేశించింది.

More Telugu News