తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పిన రాజమౌళి

04-08-2019 Sun 14:19
  • ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సెలబ్రిటీల పోస్టులు
  • ఇన్ స్టాగ్రామ్ లో స్పందించిన రాజమౌళి
  • 'ఇతడే నా భీమ్' అంటూ పోస్టు
అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ సన్నిహితుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు పెట్టారు. విధి అనుకూలంగా ఉన్న సమయంలో జీవితంలో సాయి వంటి వ్యక్తి పరిచయం అవుతాడని, అతడిది చిన్నపిల్లవాడి మనస్తత్వం అని పేర్కొన్నారు. నమ్మకానికి, కొండంత అండకు ప్రతిరూపం అంటే సాయి పేరే చెప్పుకోవాలని కొనియాడారు. అంతేకాకుండా, 'ఇతడే నా భీమ్'... తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ప్రముఖ నిర్మాత కొర్రపాటి సాయి గురించి తన పోస్టులో పేర్కొన్నారు.