Jammu And Kashmir: కశ్మీర్ లో ఉగ్రవాదిని కాల్చి చంపిన జవాన్లు

  • సోపోర్ జిల్లా మల్మపన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్టు పక్కా సమాచారం
  • ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన భద్రతాదళాలు
  • కొనసాగుతున్న ఎన్ కౌంటర్

జమ్ముకశ్మీర్ లో 'ఆర్టికల్ 35 A'ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతోందనే వార్తలతో ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనలు తలెత్తితే అణచివేసేందుకు భారీ ఎత్తున సాయుధ బలగాలు అక్కడకు చేరుకుంటున్నాయి. మరోవైపు, భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెడీ అయ్యారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిరోజు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ ఉగ్రవాదిని భద్రతాబలగాలు కాల్చి చంపాయి.

సోపోర్ జిల్లా మల్మపన్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలను భద్రతా సిబ్బంది చేపట్టింది. ఈ క్రమంలో, భద్రతాబలగాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డారు. భద్రతాబలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

More Telugu News