tik tolk: టిక్‌ టాక్‌ను నిషేధించే యోచనలో పలు రాష్ట్రాలు.. జాబితాలో తెలంగాణ కూడా!

  • ఇటీవల కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు
  • పనులు పక్కనపెట్టి కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు
  • వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై స్పందన

దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన టిక్‌ టాక్‌ యాప్‌ను పలు రాష్ట్రాలు నిషేధించే యోచన చేస్తున్నాయి. ఏడు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లగా, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. యువతను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ సామాజిక మాధ్యమం వేదిక కారణంగా ఇప్పటికే చాలా మంది తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పనులు పక్కన పెట్టి ఈ యాప్‌తో ఎక్కువ మంది కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిత్యం అందుతున్న వందలాది ఫిర్యాదులపై పలు రాష్ట్రాలు దృష్టిసారించాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు ఈ యాప్‌ను బ్యాన్‌ చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై స్పందించిన కేంద్రం 24 ప్రశ్నలతో కూడిన నోటీసులను ఆయా యాప్‌ల నిర్వాహకులకు జారీ చేసినట్లు సమాచారం.  ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో కేంద్రం హెచ్చరించింది. మరోవైపు టిక్‌ టాక్‌, హలో యాప్‌ నిర్వాహకులు ఇండియాలో వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం.

More Telugu News