Triple Talaq: ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాల్ చేస్తూ ‘సుప్రీం’లో పిటిషన్

  • ఈ చట్టంలో నేరంగా పరిగణించే అంశం ఉంది 
  • జమియాతుల్ ఉలేమా సంస్థ సవాల్
  • ఈ చట్టంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంలో నేరంగా పరిగణించే అంశాన్ని సవాల్ చేస్తూ కేరళకు చెందిన మత సంస్థ సమస్త జమియాతుల్ ఉలేమా ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. ట్రిపుల్ తలాక్ చట్టంపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని తమ పిటిషన్ లో అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.

కాగా, గత నెల 25న లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. రెండు రోజుల క్రితం రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర పడినట్టు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ లో వెల్లడించింది. 

More Telugu News