Jammu And Kashmir: కశ్మీర్ లోయలో ఉగ్ర కలకలం... అమర్ నాథ్ యాత్రికులు వెంటనే వెనక్కి వచ్చేయాలంటూ ప్రభుత్వం హెచ్చరిక

  • యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చన్న ఆర్మీ
  • పాక్ ప్రణాళిక రచించినట్టు ఆర్మీ వెల్లడి
  • అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు

జమ్మూకశ్మీర్ లోయలో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. భారీ స్థాయిలో ఉగ్రదాడి జరిగే అవకాశముందని ఆర్మీ హెచ్చరించిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అమర్ నాథ్ యాత్రికులు వెంటనే కశ్మీర్ ను వదిలిపెట్టి వెళ్లిపోవాలని, శిబిరాలను ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. అమర్ నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడబోతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారాన్ని సైన్యం ధ్రువీకరించింది. అమర్ నాథ్ యాత్రను భగ్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రదాడులకు ప్రణాళిక రచించినట్టు ఆర్మీ పేర్కొన్న నేపథ్యంలో కశ్మీర్ హోంశాఖ తాజా హెచ్చరికలు జారీచేసింది. యాత్రికుల భద్రతే తమకు ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

More Telugu News