Supreme Court: అయోధ్య మధ్యవర్తిత్వం విఫలమైంది.. 6వ తేదీ నుంచి ప్రతిరోజు వాదనలు వింటాం: సుప్రీంకోర్టు

  • అయోధ్య రామాలయం-బాబ్రీ మసీదు కేసును విచారించిన సుప్రీంకోర్టు
  • మీడియేషన్ ప్యానెల్ లో ఖలీఫుల్లా, శ్రీశ్రీ రవిశంకర్, శ్రీరాం పంచు
  • ఆరు నిమిషాల్లోనే తన అభిప్రాయాన్ని వెల్లడించిన సుప్రీంకోర్టు

అయోధ్య రామాలయం-బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించే అంశంలో మధ్యవర్తులు విఫలమయ్యారని... ఈ నేపథ్యంలో, ఆగస్ట్ 6 నుంచి ప్రతి రోజు వాదనలను వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. వివాదాన్ని పరిష్కరించే వ్యవహారానికి సంబంధించి మధ్యవర్తులు ఎలాంటి ప్రగతిని సాధించలేకపోయారని చెప్పింది. సుప్రీంకోర్టు నియమించిన మీడియేషన్ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వొకేట్ శ్రీరాం పంచు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ కేసుకు సబంధించి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు వాదనలను వింది. మధ్యవర్తిత్వం విఫలమైందని, ఇకపై ప్రతి రోజు వాదలను వింటామని కేవలం ఆరు నిమిషాల్లోనే ధర్మాసనం ప్రకటించింది.

More Telugu News