trains: పెరిగిన ప్రయాణికుల రద్దీ...నాలుగు రైళ్లకు అదనపు బోగీలు

  • దక్షిణమధ్య రైల్వే ప్రకటన
  • సికింద్రాబాద్ -పోర్బందర్‌, ఓఖా-టుటికోరిన్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లకు సదుపాయం
  • తాత్కాలిక సర్దుబాటు

పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని నాలుగు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌.రాకేష్‌ తెలిపారు. వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు రైళ్లకు తాత్కాలికంగా అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం సికింద్రాబాద్‌-పోర్బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబరు 19201)కు ఆగస్టు 7 నుంచి 28వ తేదీ వరకు అదనంగా ఒక స్లీపర్‌ క్లాస్‌ బోగీ, పోర్బందర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబరు 19202)కు ఆగస్టు 6 నుంచి 27వ తేదీ వరకు ఒక స్లీపర్‌ క్లాస్‌ బోగీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఓఖా-టుటికోరిన్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబరు 19568)కు ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ఒక ఏసీ త్రీ టైర్‌ బోగీ, టుటికోరిన్‌-ఓఖా వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైలు నంబరు 19567)కు ఆగస్టు 4 నుంచి 18వ తేదీ వరకు ఒక ఏసీ త్రీ టైర్‌ బోగీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News