MIM: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతున్న ఎంఐఎం

  • రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం
  • పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌
  • మమతతో మిత్రత్వం, శత్రుత్వం లేదని ప్రకటన

పార్టీకి క్యాడర్‌, కనీసం కార్యకర్తలు లేకున్నా త్వరలో జరగనున్న పశ్చిమబెంగాల్‌ ఎన్నికల బరిలో నిల్చునేందుకు ఎంఐఎం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. మరో ఏడాదిలోగా ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు ఓ వైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యూహం రచిస్తుంటే, సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన ఊపుతో కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు కలలుగంటున్నారు.

మధ్యలో ఇప్పుడు ఎంఐఎం కూడా పోటీకి సిద్ధమవుతోంది. ‘మాకు ఆ రాష్ట్రంలో కేడర్‌ లేదు. అయినా భయం లేదు. మమతా బెనర్జీ మమ్మల్ని మిత్రులుగా భావించినా, శత్రువులుగా భావించినా సరే, పోటీ చేయడం మాత్రం ఖాయం’ అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

More Telugu News