BCCI: బీసీసీఐపై కేంద్ర క్రీడల శాఖ సీరియస్

  • డోపింగ్ టెస్టులు నిర్వహించే అధికారం బీసీసీఐకి లేదు
  • బీసీసీఐకి వాడా గుర్తింపు లేదు
  • టెస్టులు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుంది

బీసీసీఐపై కేంద్ర క్రీడల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే, యువ ఆటగాడు పృథ్వీ షా డోపింగ్ టెస్టులో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, డోపింగ్ టెస్టులను నిర్వహించే అధికారం బీసీసీఐకి లేదని క్రీడ శాఖ మండిపడింది. ఈ మేరకు బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి లేఖ రాసింది. డోపింగ్ టెస్టులు నిర్వహించే అధికారం లేనప్పటికీ... ఆటగాళ్లకు టెస్టులు ఎలా నిర్వహిస్తారని లేఖలో ప్రశ్నించింది. డోప్ టెస్టులు చేయడం, శిక్షలు ఖరారు చేయడం పరస్పర విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తుందని తెలిపింది. అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక ఏజెన్సీ (వాడా) గుర్తించిన సంస్థతోనే టెస్టులు నిర్వహించాలని చెప్పింది. బీసీసీఐకి వాడా గుర్తింపు లేదని గుర్తు చేసింది. మరోవైపు, తమ డోపింగ్ టెస్టులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉన్నాయని బీసీసీఐ వాదిస్తోంది. 

More Telugu News