Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ 
  • ప్రశాంత్ వర్మతో అఖిల్ సినిమా 
  • తెలుగు, తమిళ భాషల్లో 'ఆర్టికల్ 15'

*  'ఓ బేబీ' చిత్రం హిట్ తర్వాత కథానాయిక సమంత అంగీకరించిన కొత్త చిత్రం ఏమిటన్నది ఇంతవరకు వెల్లడికాలేదు. ఈ క్రమంలో ఆమె సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించినట్టు తాజా సమాచారం. ఇదిలా ఉంచితే, 'ఓ బేబీ'కి ముందుగానే కమిట్ అయిన '96' రీమేక్ లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది.
*  ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న అఖిల్ అక్కినేని తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ వినిపించిన కథ నచ్చడంతో చేయడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పని జరుగుతోంది.
*  హిందీలో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'ఆర్టికల్ 15' చిత్రానికి ప్రశంసలతో పాటు వివాదాలు కూడా వచ్చిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్ లో తమిళ నటుడు ధనుశ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది.

More Telugu News